కొమరవెల్లి: కేసులు ఎత్తివేయాలి: బీఆర్ఎస్

కొమురవెల్లిలోని అంబేడ్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడం అన్యాయమన్నారు. రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణచివేత విధానాలకు నిరసిస్తూ వినతిపత్రం ఇచ్చామన్నారు. కేసులు ఎత్తివేసి అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్