పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే మల్టీజోన్-1 ఖో-ఖో జట్టుకి శిక్షణ శిబిరం బుధవారం 22 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్రీడా మైదానంలో నిర్వహించబడుతుంది. పోలీస్ ఖో-ఖో జట్టుకి కోచ్ గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంగశాయిపేట ఫిజికల్ డైరెక్టర్ గోగు నారాయణ వ్యవహరిస్తున్నారు.