ప్రభాస్ ‘కల్కి’లో కమల్ హాసన్ విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయం బయటపెట్టారు. తాజాగా చెన్నైలో ఈ చిత్రాన్ని చూసిన కమల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్కి’ రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుందని ముందే చెప్పారు. ‘‘దర్శకుడు నాగ్ అశ్విన్‌కు సహనం ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని అందంగా రూపొందించారు’’ అని ప్రశంసించారు.