పౌష్టికాహారం పంపిణీ

యాదగిరిగుట్ట మండల శాఖ భారతీయ జనతా పార్టీ సేవ హి సంఘటన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ జిల్లా కోశాధికారి కాదురి ఆచయ్య, సీనియర్ నాయకుడు రచ్చ శ్రీనివాసులు, చితర్ల కృష్ణ గౌడ్, రోజు అనాధలకు కరోనా పేషెంట్ లకు వృద్ధులకు పారిశుద్ధ్య కార్మికులకు 190 ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది. యాదగిరిగుట్ట బీజేపీ మండల ఇన్చార్జి రచ్చ శ్రీనివాసులు జిల్లా కోశాధికారి కాదురి అచ్చయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్లపేద ప్రజలు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు.

మా వంతు సహాయంగా సేవ ఈ సంఘటన కార్యక్రమంలో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి 10వరోజు 150 నుంచి 200 ఆహార పొట్లాలు ఇవ్వడం జరుగుతుంది. ఇతర గోశాలలో ఉన్న గోమాతలకు కోతులకు వాటికి ఆహారం అందియడం జరిగింది. కరోనాతో బాధపడుతున్న ఎవరికైనా మా వంతు సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా మహమ్మారి నీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లో కలపాలని ఉచిత వైద్యం వల్ల పేద ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటారని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపి మండల అధ్యక్షుడు వెంకట్ రత్నం, కోలా అనిల్ గౌడ్, భీమగాని మధు గౌడ్, బొమ్మగాని రాజమణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్