AP: వైసీపీ అధినేత జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు కుట్ర పన్నారని స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీనేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సజ్జల మాట్లాడారు. 'వైఎస్ జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుంది' అని తెలిపారు.