టాటా గ్రూప్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా మరిన్ని విమానాలను కొనుగోలు చేస్తోంది. యూరప్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు మరో 100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు తెలిపింది. ఇందులో 10 వైడ్‌బాడీ ఏ350 విమానాలు కాగా.. 90 నారోబాడీ ఏ320 తరగతికి చెందిన విమానాలు ఉన్నాయి. గతేడాది ఎయిర్‌బస్, బోయింగ్‌కు కలిపి 470 విమానాల కోసం చేసిన ఆర్డర్‌కు ఇది అదనం.