ఏపీలో 'మ్యాడ్‌స్క్వేర్‌' టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

85చూసినవారు
ఏపీలో 'మ్యాడ్‌స్క్వేర్‌' టికెట్‌ ధరల పెంపునకు అనుమతి
నార్నె నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్