AP: రాజమండ్రిలో షాకింగ్ ఘటన జరిగింది. కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఆస్పత్రి ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రైనీ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ICUలో చికిత్స పొందుతోంది. కిమ్స్ ఏజీఎం దీపక్‌కు అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు.