సంకల్పం కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల మత్తుకు చెక్ పెట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాల మత్తును "సంకల్పం" కార్యక్రమం ద్వారా తరిమేద్దామనీ పిలుపునిచ్చారు.