రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు జిల్లా కలెక్టరు, జిల్లా అక్రిడిటేషను కమిటీ చైర్మన్ విజయ కృష్ణన్ తెలిపారు. జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగించినట్లు మంగళవారం తెలిపారు. ఈ లోగా కొత్త కార్డులు జారీ అయితే విడుదల చేస్తామన్నారు.