విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం యలమంచిలిలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలన్నారు. ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు దూరం కావలసి వస్తుందన్నారు.