అనంతగిరి: బొర్రా మోటార్ యూనియన్ సభ్యులకు అవగాహన సదస్సు

68చూసినవారు
అనంతగిరి: బొర్రా మోటార్ యూనియన్ సభ్యులకు అవగాహన సదస్సు
అనంతగిరి మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన బోర్ర గుహలు మోటార్ యూనియన్ సభ్యులకు శనివారం అనంతగిరి ఎస్సై డి. శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. యూనియన్ అధ్యక్షులు డుంబరి శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సై పలు సూచనలు చేస్తూ బోర్ర గుహలు పర్యాటక ప్రాంతం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి వెళుతుంటారని వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవాలన్నారు. గంజాయి గుట్కాలకు దూరంగా ఉండాలన్నారు

సంబంధిత పోస్ట్