ముచంగిపుట్టు మండలంలోని మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీముఖీపుట్ రహదారిపై ఆదివారం భారీ పనస వృక్షం కూలింది. అయితే ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గిరిజనులు తెలిపారు. కూలిన భారీ వృక్షంతో ఆయా గ్రామాల గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంచాయతీ సర్పంచ్ త్రినాథ్ తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు.