అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చిన్నారావు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.