అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సంఘం శరణం గచ్ఛామి నాటిక కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా రాజ్యాంగా స్ఫూర్తిని నింపిందని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చలపతిరావు అన్నారు. కళాశాల నుంచి ఆయన మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యంతో కళాకారులందరు చక్కగా ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నరన్నారు. విద్యార్థినిలు మంచిమంచి నృత్యాలతో అలరించారని భవిష్యత్తులో మరెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిచారు.