సొంతంగా రహదారికి మరమ్మతులు చేపట్టిన యువకులు

69చూసినవారు
సొంతంగా రహదారికి మరమ్మతులు చేపట్టిన యువకులు
అరకులోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పరిధి సంతోష్ నగర్ కి వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు రహదారి కొంతమేర కొట్టుకుపోయి కోతకు గురైంది. కొట్టుకుపోయిన రహదారికి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో శనివారం యువకులు రహదారికి సొంతంగా మరమ్మత్తులు చేపట్టారు. ఇప్పటికైనా ఈ రహదారి సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్