అనంతగిరి మండలం టోకూరు పులుగుడా గ్రామాలకు వెళ్లే ప్రధాన మట్టి రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షలకు మట్టి కొట్టుకుపోయి గుంతలుగా ఏర్పడి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, స్థానిక పీవీటిజీ గిరిజనులు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి బిటి రోడ్డుకు నిధులు మంజూరు చెయ్యాలని కోరుతున్నారు.