భీమిలి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం హైస్కూల్లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందేళ్లు పూర్తి చేసుకున్న హైస్కూళ్లు అరుదుగా ఉంటాయని, వాటి సరసన భీమిలి హైస్కూల్ చేరడం గర్వకారణమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానించనున్నామని తెలిపారు.