విశాఖ అభివృద్ధిలో భాగంగా జనాభా రద్దీకి తగిన విధంగా మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధిపరచవలసిన అవసరం ఉందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ వివరించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ జోన్-1 పరిధిలోని కాపులుప్పాడ దరి నగరపాలెం జంక్షన్ నుంచి బోయపాలెం వరకు ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్లను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించారు.