భీమిలి: బాణాసంచా షాపుల పరిశీలన
పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పండుగ మందుగుండు సామాగ్రీ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 40 స్టాల్స్‌కు అనుమతులు ఇచ్చారు. ఓజోన్ వ్యాలీ వద్ద 33, వాంబే కాలనీ వద్ద 3, ఎంవివి సిటీ వద్ద 3, మారికవలస వద్ద 1 స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ను పీఎంపాలెం ఎస్ఐ భాస్కర్, వాంబేకాలనీ వద్ద ఎస్ఐ సునీత గురువారం తనిఖీ చేశారు.