చోడవరం మండల పరిధిలోని గ్రామ సచివాలయ కార్యదర్శులకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నైపుణ్యం, గణనపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎం. పి. డి. ఓ. ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా ప్రయోజన పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలు పై మండల అధికారులు, ఈ. ఓ. ఆర్డీ మహేష్ సుదీర్ఘంగా శిక్షణ అందజేశారు.