విఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ.. అన్నదానం

69చూసినవారు
విఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ.. అన్నదానం
బుచ్చయ్యపేట మండలం పొట్టిదోరపాలెం పరిధిలోని విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. చోడవరానికి చెందిన డాక్టర్ కే. రాధిక శ్రీరంగం, దుర్గాప్రసాద్ దంపతులు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి.. వృద్ధాశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదానం చేశారు. అంతేకాకుండా ఆశ్రమంలోని వృద్దులకు చలికోట్లు పంపిణీ చేశారు. డా. రాధిక తల్లిదండ్రులైన కీ.శే మాదిరెడ్డి హరిప్రకాశరావు, కీ.శే భానుమతి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్