చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.కిరణ్ కుమార్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ వి.అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ఎస్ఎస్డిసి స్కిల్ హబ్ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలో భాగంగా ఎస్ కే ఎల్ అసోసియేట్స్, డయాకిన్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడిట్ ఆసిస్ గ్రామీణ్ లిమిటెడ్, కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలియజేశారు.