చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామ సచివాలయం వద్ద ఆదివారం నిర్వహించిన మెగా మెడికల్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతమైంది. రాజు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి బి. అప్పలరాజు, ఎస్ ఎన్ డి సేవ నిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గీతం ఆసుపత్రి వారు సహాయ సహకారాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయనీ రాజు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి అప్పలరాజు చెప్పారు.