గాజువాక శ్రీనగర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు నుంచి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు వెంటనే బయటకు దిగి ప్రాణాలని కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.