దాతల సాయం ఆదర్శనీయం: పల్లా శ్రీనివాసరావు
వరదలతో అపారంగా నష్టపోయిన బాధితులకు గాజువాకలోని ఆదర్శ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు సమకూర్చిన రూ. 1, 57, 000ల చెక్కును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు గాజువాక పార్టీ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. యాజమాన్యం చూపిన ఉదారతను శ్రీనివాసరావు కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో మానవత్వాన్ని చూపుతూ సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.