జి.మాడుగుల మండలంలోని గేమ్మెలి పంచాయతీ పరిధి బొండలవలస ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు బుధవారం బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిరంజీవి ఆశా కార్యకర్త రాధమ్మ పాల్గొని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న బ్యాగులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.