నర్సీపట్నంలో ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరిగే అనకాపల్లి జిల్లా 24వ సీపీఎం మహా సభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న కోరారు. నర్సీపట్నంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 24 మండలాలకు చెందిన 500 మంది ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు ఈ సభలకు హాజరవుతారన్నారు.