జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు అయిన నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా సాగినట్లు తాండవ ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనురాధ నర్సీపట్నంలో మంగళవారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు డీసీలు ఎన్నికయ్యారన్నారు. అనంతరం వీరందరూ కలిసి త్వరలో తాండవ ప్రాజెక్ట్ సాగునిటి సంఘం ఛైర్మన్ తో పాటు డైరెక్టర్లను ఎన్నుకుంటారన్నారు.