డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్, 5వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సమన్వయాధికారి ఎస్. రూపవతి తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలో 3, అనకాపల్లి జిల్లా పరిధిలో 8 గురుకులాల్లో మిగుల సీట్లు భర్తీ చేస్తామన్నారు. 5వ తరగతిలో బాలుర అడ్మిషన్ కోసం 28వ తేదీ కంచరపాలెంలోని జిల్లా సమన్వయాధికారి కార్యాలయంలో, బాలికల అడ్మిషన్ కోసం 29వ తేదీ తాళ్లపాలెం అంబేడ్కర్ గురుకులంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 4వ తరగతి స్టడీ సర్టిఫికేట్, ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆమె కోరారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలుర అడ్మిషన్ కోసం 30వ తేదీ సబ్బవరం గురుకులంలో, బాలికలకు 31న మేహాద్రి గెడ్డ గురుకులంలో కౌన్సెలింగ్ ఉంటుందని తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.