విశాఖలోని రామ్‌నగర్ బజార్ లో సిపిఎం జగదాంబ జోన్ కమిటి నేత నరసింహ రావు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ బిల్లులను దహనం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపే విధంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. సిపిఎం సీనియర్ నాయకుడ రాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదానికి లాభాలు చేకూర్చే విధంగా పాలన సాగిస్తున్నాయన్నారు.