విశాఖ: ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 1. 8 కోట్లు

77చూసినవారు
విశాఖ: ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 1. 8 కోట్లు
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు సంక్రాంతి స్పెషల్స్‌ ద్వారా రూ. 1. 8 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు మంగ‌ళ‌వారం తెలిపారు. ప్రయాణికుల నుంచి సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ప్రత్యేక సర్వీసులు నడిపినప్పటికీ ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోలేదని వెల్లడించారు. ప్రత్యేక సర్వీసులు ఈపీకే (కిలోమీటరుకు ఆదాయం) రూ. 42 సాధించినట్టు అధికారులు లెక్కలు కట్టారు.

సంబంధిత పోస్ట్