కొయ్యూరు మండలం రత్నంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు శనివారం జరిగాయి. 15 మంది సభ్యులతో నూతన విద్యా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది. పాటి నది కుమార్ చైర్మన్ గా, పప్పుల ఎర్రయమ్మ వైస్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. భరత్ కుమార్ తెలిపారు. పాఠశాల లో విద్యాభివృద్ధిలో విశేషంగా కృషి చేస్తామని విద్యా కమిటీ సభ్యులందరూ ప్రతిజ్ఞ చేశారు.