పరవాడ ఫార్మసిటీ విష్ణు కెమికల్స్ కంపెనీలో శనివార విధి నిర్వహణలో యూపీకి చెందిన కార్మికుడు రాజ్ వీర్(20) కన్వేయర్ బెల్ట్ లో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. దీనిపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ స్పందించారు. కార్మికుడు మృతిపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫార్మా పరిశ్రమలలో వరుస ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు.