భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రియమైన మార్గశిర గురువారంలో ఘనంగా తొలిపూజ నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి భక్తులు రాష్ర్ట వ్యాప్తంగా తరలివచ్చారు. ఈమేరకు ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.