విశాఖ: గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
By ఆర్ కిరణ్ కుమార్ 53చూసినవారుజనవరి 26న పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.