విశాఖ: ఏపీజీఎల్ఐ శాఖాధిపతి సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా సంస్థ శాఖాధిపతి రెడ్డి శ్రీనివాస్ జోన్-1 పర్యటనలో భాగంగా శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లా ఏ. పీ. జి ఎల్. ఐ. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పాలసీదారులకు రుణాలు , క్లైములు పరిష్కరించడంలో కార్యాలయపు సిబ్బంది పనితీరుపై సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత అవగాహన కల్పించాలని సూచించారు.