మునగపాక మండలం పురుషోత్తపురం గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భాన్ని పురస్కరించుకుని సీతమ్మ పేరంటాల తీర్థ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన తీర్థ మహోత్సవంలో మహిళలు బాలికలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది.