అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. ఎస్. వి. కె. బాలాజీ ఆదేశాలు మేరకు ఆశా డే బుధవారం ఉదయం నుంచి సాయింత్రం వరకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డయేరియా బారిన పడకుండా వుండాలంటే క్లోరినేషన్ చేసిన మరగకాచి చల్లార్చి వడబోసిన నీటిని త్రాగాలన్నారు.