జాతీయ లోక్ అదాలత్ లో 356 కేసులు పరిష్కారం

81చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ లో 356 కేసులు పరిష్కారం
ఎలమంచిలి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 356 కేసులను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి పి. విజయ, అడిషనల్ సివిల్ జడ్జి ఏ. రాజేష్ తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ను నిర్వహించినట్లు తెలిపారు. కేసుల రాజీకి సంబంధించి రుసుం/జరిమానాను కక్షిదారులకు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్