అంబేడ్కర్ గురుకుల పాఠశాలల అడ్మిషన్స్ ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన డీసీవోను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, ఏపీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నే చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత ప్రజా విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్షలో వారు మాట్లాడారు.