ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అనంతపురం జిల్లాకు ఆదివారం మధ్యాహ్నం రానున్నారు. 1: 30 గంటలకు జీడిపల్లి రిజర్వాయర్ను పరిశీలిస్తారు. అనంతరం అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ టీడీపీ నాయకులతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చెర్లోపల్లి రిజర్వాయర్ చేరుకుని పరిశీలిస్తారు. అటు నుంచి బయలుదేరి హార్సీలిహిల్స్ చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.