అనంతపురం జిల్లా వ్యాప్తంగా గల ప్రతి చెరువుకు నీరు ఇచ్చి, హంద్రీ నీవాకు సాగునీరు అందించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు గురువారం వినతి పత్రం ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుస కరవుతో ప్రతి ఏడాది పంటలు నష్టపోతూ పెట్టుబడులు తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, రైతులను ఆదుకోవాలని కోరారు.