కేతిరెడ్డితో వైసీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భేటీ
ధర్మవరం పట్టణంలో మంగళవారం మాజీ ఎమ్యెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని వైసీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి కలిశారు. అనంతరం ఉమ్మడి అనంత జిల్లాలోని పలు రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ చూసిన దాడులను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు.