కంబదూరు: ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ఇతర ప్రయోజనాలు పొందాలంటే ప్రతి రైతూ తప్ప కుండా ఈ-క్రాప్ నమోదు చేయించాలని ఉద్యానవన శాఖ అధికారిణి గౌసియా బీ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాయితీలతో పాటు అన్ని రకాల ప్రయోజనాలు పొందాలంటే తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించాలన్నారు. సెప్టెంబర్ 15 లోపు రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ నమోదు చేయించాలన్నారు.