కీర్తిశేషులు కే. జయరాం జన్మదినోత్సవ సందర్భంగా జయరాం కుటుంబ సభ్యులు బుధవారం కుందుర్పి జూనియర్ కళాశాలలో కామర్స్ గ్రూపు నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చినవారికి నగదు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చల్లా కిషోర్, కరణం మల్లికార్జున, బాబు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, రిటైర్డ్ ఆంగ్ల ఉపన్యాసకులు మల్లికార్జున, విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి పాల్గొన్నారు.