అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను గురువారం కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని శాంతిభద్రతల గురించి చర్చించారు. ప్రజల శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయనకు ఎమ్మెల్యే సూచించారు.