పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పరును ఆదివారం యాడికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాడికి మండల పరిధిలోని రాయలచెరువులో గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఇసుకను తరలిస్తున్న టిప్పరు కనిపించడంతో పరిశీలించగా ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. సదరు వాహనాన్ని స్టేషనుకు తరలించి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ ఈరన్న తెలిపారు.