ధర్మవరంలోని పేట బసవన్న కట్ట వీధిలో గల శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో గురువారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ.. కార్తీక మాసం నాలుగో గురువారం త్రయోదశి సందర్భంగా శివుడికి, నందీశ్వరుడికి సుగంధ ద్రవ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.