ధర్మవరంలో 300 కుటుంబాలు జనసేనలోకి జంప్

79చూసినవారు
ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ఆదివారం పట్టణంలోని 28వ వార్డు కేతిరెడ్డి కాలనీలో 300 మంది వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సరితాలా భాష, తోపుదుర్తి వెంకట రాముడు తొండమాల రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్